పోలీసుల అయ్యప్ప దీక్షలపై ఆంక్షలు.. దీక్ష తీసుకోవాలంటే రెండు నెలల సెలవు తప్పదు

Update: 2019-11-06 15:12 GMT

నవంబర్ వచ్చిందంటే చాలు ఎంతో మంది అయ్యప్ప దీక్ష తీసుకుంటారు. అలాంటి వారిలో పోలీసులు కూడా ఉంటారు. ఇప్పటి వరకూ పోలీసులు ప్రత్యేక అనుమతి తీసుకొని విధుల్లో ఉంటూనే అయ్యప్ప దీక్ష కొనసాగించారు. ఇప్పుడు మాత్రం అలాంటి ప్రత్యేక అనుమతులు కుదరవని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు.

దీక్ష తీసుకున్న పోలీసులు రెండు నెలల పాటు సెలవు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. విధుల్లో ఉన్న వారు తప్పనిసరిగా యూనిఫాం, షూస్ ధరించి హాజరు కావాల్సిందేనని తేల్చిచెప్పారు. దీంతో ఈ అంశం పై వివాదం చెలరేగింది. విద్యాసంస్థల్లోనూ గతంలో ఇలాంటి వివాదాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు అలాంటివి మరింత తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది. 

Tags:    

Similar News