Narayana Junior College: నారాయణ జూనియర్ కాలేజీలో దారుణం.. విరిగిన విద్యార్థి దవడ ఎముక!

Narayana Junior College: హైదరాబాద్ సిటీలో నారాయణ కాలేజీలో సిబ్బంది అరాచకానికి పాల్పడ్డారు.

Update: 2025-09-18 09:39 GMT

Narayana Junior College: హైదరాబాద్ సిటీలో నారాయణ కాలేజీలో సిబ్బంది అరాచకానికి పాల్పడ్డారు. గడ్డిఅన్నారం బ్రాంచి నారాయణ కాలేజీ ఫ్లోర్ ఇంచార్జ్ ఓ విద్యార్ధిపై దాడికి పాల్పడ్డాడు. విద్యార్ధుల మధ్య జరిగిన వివాదం విషయంలో ఫ్లోర్ ఇంచార్జ్ సతీష్ జోక్యం చేసుకుని విద్యార్ధులను చితకబాదాడు. ఘటనలో ఓ విద్యార్ధి దవడ ఎముక విరిగింది. విద్యార్ధి పేరంట్స్ మలక్ పేట పోలీసుకు ఫిర్యాదు చేశారు. విద్యార్ధిపై చేయి చేసుకున్న ఫ్లోర్ ఇంచార్జి మాలి సతీష్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాలేజీ యాజమాన్యం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News