Hyderabad Metro Fare: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మెట్రో టికెట్ ధరలు తగ్గింపు! నూతన ఛార్జీల చార్ట్ ఇదే..!
Hyderabad Metro Fare: హైదరాబాద్‌లో ప్రయాణికులకు శుభవార్త. మెట్రో రైలు ఛార్జీలను అధికారికంగా తగ్గించారు.
Hyderabad Metro Fare: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మెట్రో టికెట్ ధరలు తగ్గింపు! నూతన ఛార్జీల చార్ట్ ఇదే..!
Hyderabad Metro Fare: హైదరాబాద్‌లో ప్రయాణికులకు శుభవార్త. మెట్రో రైలు ఛార్జీలను అధికారికంగా తగ్గించారు. శనివారం (మే 24) నుంచి సవరించిన టికెట్ ధరలు అమల్లోకి రానున్నాయి. ఈ నిర్ణయం నగరంలో రోజూ మెట్రో ప్రయాణించే వందలాది మంది ప్రయాణికులకు కొంత ఊరట కలిగించనుంది.
కొత్త మెట్రో ఛార్జీలు ఇలా ఉన్నాయి:
0–2 కి.మీ వరకు: ₹12 నుంచి ₹11
2–3 కి.మీ వరకు: ₹18 నుంచి ₹17
4–6 కి.మీ వరకు: ₹30 నుంచి ₹28
6–9 కి.మీ వరకు: ₹40 నుంచి ₹37
9–12 కి.మీ వరకు: ₹50 నుంచి ₹47
12–15 కి.మీ వరకు: ₹55 నుంచి ₹51
ఈ ఛార్జీల తగ్గింపు ప్రజలకు ప్రయోజనకరంగా ఉండనుందని, ప్రయాణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇక, మెట్రో గరిష్ఠ ఛార్జీ రూ.69గా ఉంటుందని తెలిపారు.