Hyderabad: కర్రతో కొట్టి.. నరాలు కోసి.. చున్నీతో గొంతు బిగించి..

Hyderabad: ప్రేమ అనేది నమ్మకంపై ఆధారపడితే, అనుమానం ఒక కుటుంబాన్ని ఛిద్రమిచేయగల శక్తివంతమైన భూతం. అందుకు ఉదాహరణగా బాలాపూర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న దారుణ ఘటన నిలుస్తోంది.

Update: 2025-05-15 06:22 GMT

Hyderabad: కర్రతో కొట్టి.. నరాలు కోసి.. చున్నీతో గొంతు బిగించి..

Hyderabad: ప్రేమ అనేది నమ్మకంపై ఆధారపడితే, అనుమానం ఒక కుటుంబాన్ని ఛిద్రమిచేయగల శక్తివంతమైన భూతం. అందుకు ఉదాహరణగా బాలాపూర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న దారుణ ఘటన నిలుస్తోంది. అనుమానంతో భార్యను గాజుతో చేయి నరాలు కోసి ఆపై చున్నీతో ఆమె గొంతు బిగించి హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది.

ఈ ఘటన వివరాల్లోకి వెళితే…గోల్కొండ ప్రాంతానికి చెందిన జాకీర్‌ అహ్మద్‌ (31)కు ఇద్దరు భార్యలు. అందులో రెండో భార్య నాజియాబేగం (30)కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇటీవల ఆమెపై అనుమానం పెరిగిపోవడంతో, 15 రోజుల క్రితం జల్‌పల్లి కొత్తాపేట కాలనీకి భార్యతో కలిసి మకాం మార్చాడు.

అనుమానంతో రహస్యంగా భార్యను గమనిస్తున్న జాకీర్‌, మే 13వ తేదీ రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాడు. పిల్లలు మరో గదిలో ఉన్న సమయంలో, నాజియాబేగంపై వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ వాగ్వాదం చేశాడు. ఆగ్రహంతో కర్రతో తలపై బాది, అనంతరం కిటికీ అద్దాన్ని విరగ్గొట్టి గాజు ముక్కతో కుడిచేయి నరాలను కోసి, చివరికి చున్నీతో గొంతు బిగించి హత్య చేశాడు.

ఈ దారుణ ఘటన అనంతరం జాకీర్‌ అక్కడి నుండి పరారయ్యాడు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న పిల్లలు అమ్మమ్మకు ఫోన్‌ చేసి జరిగిన విషయాన్ని చెప్పారు. వెంటనే నాజియాబేగం తల్లి, సోదరుడు ఘటనా స్థలానికి చేరుకుని బాలాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్ సుధాకర్‌ కథనం ప్రకారం కేసు నమోదు చేసి, పలువురు పోలీసు బృందాలతో నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది. అనుమానం ఎంత దారుణ పరిణామాలకు దారితీస్తుందో ఈ ఘటన మరోసారి తేటతెల్లం చేసింది.

Tags:    

Similar News