Hyderabad Lockdown Updates: హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌...ఎప్పటి నుంచో తెలుసా ?

Update: 2020-06-30 11:11 GMT

Hyderabad Lockdown Updates: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి చాపకింద నిరులా విస్తరించి వేలల్లో కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కేసులు ఇంతకింతకు రెట్టింపు అవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరంలో లాక్ డౌన్ విధించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. జులై 3వ తేదీ నుంచి 15 రోజులపాటు హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ విధించేందుకు ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా అనుమతి తెలిపినట్లుగా సమాచారం. ఇక పోతే నగరంలో లాక్‌డౌన్‌ విధించే అంశంపై తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం రేపు లేదా ఎల్లుండి జరిగే అవకాశం ఉంది.

ఇక రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ విధింపే సరైన చర్యగా నిపుణులు పేర్కొంటున్నారు. స్వీయ క్రమశిక్షణ ఉంటే పరిస్థితులు భిన్నంగా ఉండేవన్నారు. అంతే కాదు క్రితంసారి విధించిన లాక్‌డౌన్‌కు భిన్నంగా ఈసారి విధించబోయే లాక్‌డౌన్‌ ఉండనున్నట్లు సమాచారం. గతంతో విధించిన లాక్ డౌన్ సమయంలో జాగ్రత్త చర్యలు పాటించడంలో ప్రజలు విఫలమయ్యారని ప్రభుత్వానికి సమర్పించిన వివిధ నివేదికలు సూచిస్తున్నాయి. ఇక ఈ సారి విధించే లాక్ డౌన్ లో నిత్యావసర సరుకుల దుకాణాలు, మెడికల్‌ షాపులు మినహా మిగతా అన్ని దుకాణాలను మూసివేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. వాటితో పాటు స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌, రవాణాశాఖ కార్యాలయాలను తెరిచిఉంచే విషయమై ప్రభుత్వం పరిశీలన చేస్తోంది. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ విధించే విషయాన్ని పరిశీలిస్తుంది. ముఖ్యంగా మద్యం దుకాణాలను కూడా బంద్‌ పెట్టే విషయాన్ని పరిశీలించనున్నారు. ఇక ఇప్పటికే ఐటీ కార్యాలయాలు 50 శాతం ఉద్యోగులతో పనిచేస్తున్న సంగతి తెలిసిందే. వైరస్‌ వ్యాప్తి చెందుతున్న ప్రాంతాల్లో వీటిని పటిష్టంగా అమలు చేయనున్నారు.

వ్యాధి వ్యాప్తి నిరోధానికి అధికారులు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు. నూతన మార్గదర్శకాల ప్రకారం ఈసారి లాక్‌డౌన్‌ నియమాలు కఠినంగా ఉండనున్నట్లు సమాచారం. సరోజిని కంటి ఆస్పత్రి, ప్రకృతి చికిత్సాలయం, ఆయుర్వేదిక్‌, చార్మినార్‌ నిజామియా ఆస్పత్రుల్లో రోగుల నుంచి స్వాబ్‌ శాంపిల్స్‌ను సేకరించి కరోనా పరీక్షల నిర్వహించనుంది. మరోప్రక్క 24 గంటలపాటు ప్రభుత్వం కరోనా పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.




Tags:    

Similar News