Hyderabad Historical Places Reopen Postponed: చార్మినార్, గోల్కొండ సందర్శనకు బ్రేక్..

Hyderabad Historical Places Reopen Postponed: రాష్ట్రంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో నగరంలోని చార్మినార్, గోల్కొండ కోట సందర్శనను పురావస్తుశాఖ అధికారులు నిలిపివేశారు.

Update: 2020-07-07 07:46 GMT
Charminar (File Photo)

Hyderabad Historical Places Reopen Postponed: రాష్ట్రంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో నగరంలోని చార్మినార్, గోల్కొండ కోట సందర్శనను పురావస్తుశాఖ అధికారులు నిలిపివేశారు. దీంతో ఆ రెండు కట్టడాల్లో సందర్శకులు లేక వెలవెల బోతున్నాయి. కాగా గత కొద్ది రోజుల క్రితమే పురావస్తు శాఖ జూలై 6 వ తేది నుంచి ఈ రెండు చారిత్రక కట్టడాలను సందర్శించడానికి అనుమతి ఇచ్చింది.ఆన్‌లైన్ ద్వారా టికెట్ల విక్రయం ప్రారంభించడంతో.. కొందరు టికెట్లను కొనుగోలు చేశారు. కానీ ప్రస్తుతం ఈ రెండు ప్రాంతాల్లో కరోనా కేసులు ఎక్కువ పెరుగుతుండడంతో కట్టడాలు కంటైన్మెంట్ జోన్‌లో ఉన్నాయి. దీంతో సోమవారం మధ్యాహ్నం వరకు ఆశించిన స్థాయిలో సందర్శకులు రాకపోవడంతో పురవాస్తు శాఖ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులతో చర్చించి సందర్శనను నిలిపేశారు.

ఇక అదే విధంగా సోమవారం మధ్యాహ్నం సమయంలో పోలీసులు చార్మినార్‌ను సందర్శించారు. చార్మినార్‌పైకి ఎక్కడానికి ఇరుకైన మెట్ల మార్గం ఉండటంతో భౌతిక దూరం పాటించడం కుదరదని తెలిపారు. దీంతో పురవాస్తు శాఖ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులతో చర్చించి సందర్శకులను అనుమతిని వాయిదా వేశారు. ఇక పోతే దేశవ్యాప్తంగా చారిత్రక కట్టడాల సందర్శనకు పురావస్తు శాఖ అనుమతి ఇచ్చింది. ఇక నగరంలోని రెండు కట్టడాలను ఈ నెల చివరి వారంలో తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. 


Tags:    

Similar News