Heavy Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

Heavy Rain: హైదరాబాద్‌లో మళ్లీ వర్షం మొదలైంది. పలుచోట్ల భారీగా వర్షం కురుస్తోంది.

Update: 2025-05-21 10:30 GMT

Heavy Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

Heavy Rain: హైదరాబాద్‌లో మళ్లీ వర్షం మొదలైంది. పలుచోట్ల భారీగా వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, సరూర్‌నగర్‌, కొత్తపేట, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌, మారేడుపల్లి, అల్వాల్‌, సైదాబాద్‌, తిరుమలగిరి, బేగంపేట, సంతోష్‌నగర్‌, చాదర్‌ఘాట్‌, యూసఫ్‌గూడా, అమీర్‌పేట్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఎస్సార్‌నగర్‌, ఎర్రగడ్డ, తార్నాక, హబ్సిగూడ, అంబర్‌పేట, మాదాపూర్, కూకట్‌పల్లి, నాంపల్లి, కోఠి, లక్డీకపూల్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.

అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. వర్షం వలన పలుచోట్ల రహదారులపై భారీగా నీరు నిలిచింది. వరద నీటితో వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వర్షం పడుతోంది. వర్షం ధాటికి కరెంట్ సరఫరా నిలిచిపోయింది. మ్యూన్‌హోళ్లు పొంగిపోర్లుతున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 




Tags:    

Similar News