Telangana Weather: హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం.. రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ

Telangana Weather: హైదరాబాద్ నగరం ఈ ఉదయం కుండపోత వర్షంతో తడిసి ముద్దయింది.

Update: 2025-10-29 06:14 GMT

Telangana Weather: హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం.. రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ

Telangana Weather: హైదరాబాద్ నగరం ఈ ఉదయం కుండపోత వర్షంతో తడిసి ముద్దయింది. తెల్లవారుజామునుంచే పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్లు జలమయం అయ్యాయి. ఇదిలా ఉండగా, రానున్న గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు మరింత తీవ్రతతో కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. రేపటికీ వర్షాలు కొనసాగుతాయని, ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించింది.

మొంథా తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ‘తెలంగాణ వెదర్‌మ్యాన్’ అంచనా వేశారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో 80 నుంచి 180 మిల్లీమీటర్ల వరకు వర్షం పడే అవకాశం ఉందని చెప్పారు.

హైదరాబాద్‌లోనూ బుధవారం మొత్తం రోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. బలమైన గాలులు వీస్తాయని, అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1 వరకు ఉదయం పొగమంచు లేదా మబ్బులతో కూడిన వాతావరణం ఉంటుందని వెల్లడించింది. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, వర్షాల సమయంలో అవసరమైతేనే బయటకు రావాలని సూచించారు.

Tags:    

Similar News