CP VC Sajjanar: విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడి చేస్తే కఠిన చర్యలు

CP Sajjanar: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ అధికారులపై దాడులకు పాల్పడే వారికి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు.

Update: 2025-11-20 07:05 GMT

CP VC Sajjanar: విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడి చేస్తే కఠిన చర్యలు

CP Sajjanar: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ అధికారులపై దాడులకు పాల్పడే వారికి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. పోలీసులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సిబ్బందితో సహా ఏ ఇతర ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించినా లేదా దాడులు చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

దాడులకు పాల్పడిన వారిపై 221, 132, 121(1) వంటి కఠిన సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయని, అంతేకాక వారిపై హిస్టరీ షీట్‌లు కూడా తెరవబడతాయని సీపీ పేర్కొన్నారు.

ఒక్కసారి కేసు నమోదైతే, భవిష్యత్తు అంధకారమయ్యే ప్రమాదం ఉందని సజ్జనార్ హెచ్చరించారు. పాస్‌పోర్ట్ జారీ, ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని, క్షణికావేశంలో చేసే చిన్న తప్పు జీవితాంతం కుమిలిపోయేలా చేస్తుందని ఆయన ప్రజలను హెచ్చరించారు.

Tags:    

Similar News