Hyderabad: చిట్టీ పేరుతో బురిడీ.. చిట్టీలో రూపంలో రూ.3 కోట్లు వసూలు చేసిన దంపతులు
Hyderabad: హైదరాబాద్‌లో చిట్టీలో పేరుతో ఘరానా మోసం బయటపడింది. చిలకానగర్ కుమ్మరికుంటలో ఇద్దరు దంపతులు చిట్టీల రూపంలో 3 కోట్ల రూపాయలు వసూలు చేసి పరారయ్యారు.
Hyderabad: చిట్టీ పేరుతో బురిడీ.. చిట్టీలో రూపంలో రూ.3 కోట్లు వసూలు చేసిన దంపతులు
Hyderabad: హైదరాబాద్‌లో చిట్టీలో పేరుతో ఘరానా మోసం బయటపడింది. చిలకానగర్ కుమ్మరికుంటలో ఇద్దరు దంపతులు చిట్టీల రూపంలో 3 కోట్ల రూపాయలు వసూలు చేసి పరారయ్యారు. పదేళ్లుగా కుమ్మరికుంటలో అద్దె ఇంట్లో సురేష్, శాంతి దంపతులు నివాసం ఉన్నారు. చుట్టుపక్కల వారితో పరిచయం పెంచుకుని అధిక వడ్డీల ఆశచూపి, చిట్టీల పేరుతో స్థానికుల నుంచి 3 కోట్లకు పైగా వసూలు చేశారు. అద్దె ఇంటికి తాళం పెట్టి దంపతులు ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి పరారయ్యారు. మోసపోయినట్లు గుర్తించి బాధితులు ఉప్పల్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పరారైన ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.