Tank Bund: ట్యాంక్‌బండ్‌కు జలకళ
Tank Bund: నిండుకుండలా మారిన హుస్సెన్‌సాగర్
Tank Bund: ట్యాంక్‌బండ్‌కు జలకళ
Tank Bund: గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సెన్ సాగర్ నిండుకుండలా మారిపోయింది. వివిధ మార్గాల గుండా వరద నీరు సాగర్‌లోకి చేరడంతో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. దీంతో హుస్సెన్ సాగర్ జలకళను సంతరించుకుంది. గరిష్టస్థాయి నీటిమట్టం 514.75 అడుగులు కాగా ప్రస్తుతం సాగర్‌లో 513.41 అడుగులుగా ఉంది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు వర్షాలున్న నేపథ్యంలో సాగర్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.