Ganesh Immersion: గణేష్ నిమజ్జనానికి సిద్ధమైన హుస్సేన్‌సాగర్

Ganesh Immersion: ట్యాంక్ బండ్‌తో పాటు 14 చెరువుల వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు

Update: 2021-09-18 07:51 GMT

గణేష్ నిమజ్జనానికి సిద్దమైన హుస్సేన్ సాగర్ (ఫైల్ ఇమేజ్)

Ganesh Immersion: భాగ్యనగరంలో గణపతి ఉత్సవాలు చివరిదశకు చేరుకున్నాయి. నవరాత్రులు పూజలు అందుకున్నగణనాథుల నిమజ్జనం కోసం సిద్దం అవుతున్నాయి. నగరంలో గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హుస్సేన్ సాగర్ తో పాటు, చెరువులు, కుంటలలో నిమజ్జనం జరుపబోతున్నారు. హైదరాబాద్ లో జరగబోయే నిమజ్జనం ఏర్పాట్ల పై ఓ స్టోరి.

భాగ్యనగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నిమజ్జన ప్రక్రియ కోసం 162 గణేష్ యాక్షన్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఈ యాక్షన్ టీమ్‌లలో మొత్తం 8వేల116 మంది సిబ్బందిని నియమించారు. నిమజ్జనానికి వివిధ కెపాసిటిగల 330 క్రేన్లను అందుబాటులో ఉంచారు. మొత్తం 33 చెరువులు, 25 ప్రత్యేక కొలనుల్లో నిమజ్జన ప్రక్రియ జరగబోతుంది. నిమజ్జనం రోజు మొత్తం 33 చెరువులలో 106 క్రేన్లను ఏర్పాటు చేశారు. ఇందులో ట్యాంక్ బండ్ లో 33 క్రేన్లు, హుస్సేన్ సాగర్ ఎన్టీఆర్ మార్గ్ లో 11 క్రేన్లను ఏర్పాటు చేశారు. నిమజ్జన వ్యర్థాలను తొలగించేందుకు ఎక్స్ లేటర్లు 20, 21 జేసీబీలు, మినీ టిప్పర్లు 39, 10 టన్నుల సామర్థ్యం కలిగిన 44 వాహనాలను ఏర్పాటు చేశారు.

ఇక నిమజ్జన కార్యక్రమం చూసేందుకు వచ్చే భక్తుల కోసం వాటర్ బోర్డు ఆధ్వర్యంలో 101 ప్రాంతాల్లో స్పెషల్ క్యాంపులు ఏర్పాటు చేసి భక్తుల కోసం 30 లక్షల నీటి ప్యాకెట్లను అందిస్తున్నారు. ఆర్ అండ్ బి డిపార్ట్ మెంట్ ద్వారా బారీకేడ్లు, వాచ్ టవర్స్, వ్యూ కట్టర్స్ ఏర్పాటు చేశారు. విపత్తులను ఎదుర్కొవడానికి నిమజ్జన మార్గాల్లో అగ్నిమాపక శాఖ ద్వారా 38 ఫైర్ వెహిక్సిల్స్ తో సరూర్ నగర్, ప్రగతి నగర్, కాప్రా చెరువులలో ఒకొక్కటి చొప్పున మూడు బోట్లను ఏర్పాటు చేశారు. టూరిజం శాఖ ద్వారా ట్యాంక్ బండ్ లో 3 బోట్స్, నక్లెస్ రోడ్ లో 2 బోట్స్ తో పాటు మరో నాలుగు స్పీడ్ బోట్స్, పది మంది గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. విద్యుత్ శాఖ ద్వారా విద్యుత్ కు అంతరాయం కలుగకుండా నిరంతరంగా సరఫరా చేసేందుకు వివిధ ప్రాంతాల్లో 101 ట్రాన్స్ ఫార్మర్ లను ఏర్పాటు చేశారు. 41,284 వీధి దీపాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా విగ్రహ ప్రతిమలను నీటిలో వేసినప్పుడు కలుషితం కాకుండా జిహెచ్ఎంసి ప్రత్యేక పటిష్టమైన చర్యలు చేపట్టారు. అందమైన విద్యుత్ దీపాల అలకరణలతో పాటు భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పిస్తున్నారు.

Tags:    

Similar News