Toll Gate: వాహనదారులపై మరో భారం

Toll Gate: భారీగా పెరిగిన టోల్ చార్జీలు * కనిష్టంగా రూ. 5 నుంచి గరిష్టంగా రూ. 25 వరకు పెంపు

Update: 2021-04-03 08:16 GMT
టోల్ గేట్ (ఫైల్ ఇమేజ్)

Toll Gate: అసలే పెరిగిన ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాలపై ఇప్పుడు మరో భారం పడింది. నేషనల్ హైవేలపై టోల్‌ చార్జీలు పెరిగాయి. ఒక్కో వాహనానికి రానుపోను కలిపి కనిష్ఠంగా 5 రూపాయల నుంచి గరిష్ఠంగా 25 రూపాయల వరకు పెంచారు. జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల దగ్గర బుధవారం అర్ధరాత్రి నుంచే కొత్త రుసుములు అమల్లోకి వచ్చాయి. ఏడాది కాలం పాటు ఈ ధరలు అమల్లో ఉంటాయి.

ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ చార్జీలు రెండేళ్లుగా ఆర్థిక సంవత్సరంలో ప్రారంభంలో పెరిగాయి. ప్రస్తుతం చెల్లించే ధర పై అదనంగా 3.5 శాతం చార్జీలు పెంచుతూ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ నిర్ణయించింది. ప్రతి కిలోమీటర్ పై కనీసం 7-53 పైసల మేర అదనపు చార్జీలు పెంచారు.

ఇప్పటికే అన్ని ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు తాజాగా పెరిగిన టోల్ చార్జీలు మరింత ఆందోళన కలిగిస్తుంది. కోవిడ్ తర్వాత ప్రజల్లోఆర్థిక వృద్ది జరగనందున ప్రభుత్వాలు పెంచుతున్నచార్జీల పై దష్టిసారించాలని కోరుతున్నారు.

Tags:    

Similar News