Drugs: హైదరాబాద్ శివారులో భారీగా డ్రగ్స్ పట్టివేత.. రూ.9కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్
Drugs: ఇంటర్‌పోల్ సాయంతో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు
Drugs: హైదరాబాద్ శివారులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. దాదాపు 9కోట్ల విలువైన డ్రగ్స్‌ను సీజ్ చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. ఇంటర్‌పోల్ సాయంతో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు చేసి, డ్రగ్స్ తయారు చేస్తున్న కస్తూరిరెడ్డి నల్లపొడిని అరెస్ట్ చేశారు. ఐడీఏ బొల్లారంలోని ఓ ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు ఇంటర్‌పోల్ సమాచారం ఇచ్చింది. రంగంలోకి డ్రగ్ కంట్రోల్ అధికారులు.. PSN మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సోదాలు నిర్వహించారు.
నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు గుర్తించారు. 90 కిలోల మెపిడ్రిన్ డ్రగ్‌ను సీజ్ చేశారు. గత పదేళ్లుగా డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. తయారైన డ్రగ్‌ను సిగరెట్ ప్యాకెట్లలో పెట్టి విదేశాలకు తరలిస్తున్నట్టు సమాచారాన్ని సేకరించారు. హైదరాబాద్‌లోనూ డ్రగ్స్ సరఫరా చేసినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు.