Hyderabad: భారీగా బయటపడ్డ బ్లాక్‌మనీ

Hyderabad: కేవలం రెండు వారాల్లోనే దాదాపు 3వేల 200 కోట్ల రూపాయలను ఐటీ అధికారులు గుర్తించారు

Update: 2021-04-01 08:12 GMT

ఇన్కమ్ టాక్స్ (ఫైల్ ఫోటో)

Hyderabad: హైదరాబాద్‌లో భారీగా బ్లాక్‌మనీ బయటపడుతోంది. కేవలం రెండు వారాల్లోనే దాదాపు 3వేల 200 కోట్ల రూపాయలను ఐటీ అధికారులు గుర్తించారు. ఓ ఫార్మా కంపెనీతో పాటు రియల్ ఎస్టేట్‌ కంపెనీల్లో బ్లాక్‌మనీ ఉన్నట్లు గుర్తించారు. 10 రోజుల క్రితం ఫార్మా కంపెనీలో సోదాలు నిర్వహించి.. 2వేల కోట్ల రూపాయల బ్లాక్‌మనీ లావాదేవీలను గుర్తించారు ఐటీ అధికారులు.

తాజాగా హైదరాబాద్‌కు చెందిన స్పెట్రా, సన్‌సిటీ కంపెనీల్లో సోదాలు నిర్వహించగా.. 700 కోట్ల రూపాయల బ్లాక్‌మనీ లావాదేవీలు గుర్తించారు. బ్లాక్‌మనీ లావాదేవీల కోసం కంపెనీలు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసుకున్నారు. ఇక యాదాద్రి తదితర ప్రాంతాల్లో భారీగా వెంచర్లు వేసిన కంపెనీలు.. వేల ఎకరాల్లో రియల్ ఎస్టేట్‌ వ్యాపారం చేశారు. ఈ రెండు కంపెనీల్లో సోదాలు నిర్వహించిన అనంతరం.. కంపెనీలకు సంబంధించిన లావాదేవీలను ఐటీ అధికారులు సీజ్‌ చేశారు.

Tags:    

Similar News