Indrakaran Reddy: వెదజల్లే పద్ధతితో అధిక దిగుబ‌డి

Indrakaran Reddy: దాన్యం వెదజల్లడం వంటి పద్దతుల్లో వరిసాగు చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

Update: 2021-07-06 12:12 GMT

Indrakaran Reddy: వెదజల్లే పద్ధతితో అధిక దిగుబ‌డి

Indrakaran Reddy: దాన్యం వెదజల్లడం వంటి పద్దతుల్లో వరిసాగు చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోన్ మండలం పాక్ పట్ల గ్రామంలోని తన పొలం వద్ద మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పూజ నిర్వహించారు. అనంతరం మంత్రి స్వయంగా మడిలోకి దిగి వరి విత్తనాలను వెదజల్లారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..తెలంగాణ‌లో అనాదిగా వ‌రి నాట్లు వేసే విధానం ఉంద‌న్నారు. అయితే కూలీల కొర‌త‌తో క్రమంగా వరిలో మూస పద్ధతికి స్వస్తి చెబుతూ రైతులు ప్రత్యక్ష సాగుకు ఆసక్తి చూపుతున్నార‌ని తెలిపారు. ఈ పద్ధతిలో వరి పంట సాగు చేస్తే దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉండ‌టంతో సీఎం కేసీఆర్‌ ఈ నూతన విధానాన్ని ప్రోత్సహిస్తున్నార‌ని తెలిపారు. ఈ విధానంలో సాగుద్వారా రైతుకు అనేక లాభాలున్నాయని, కూలీల కొరతను అధిగమించడంతోపాటు పెట్టుబడి ఖర్చు భారీగా తగ్గుంతుద‌ని పేర్కొన్నారు.

Tags:    

Similar News