తెలంగాణలో మండిపోతున్న ఎండలు.. భానుడి సెగలతో అల్లాడుతున్న జనాలు
Telangana: రికార్డు స్థాయిలో నమోదవుతున్న పగటి ఉష్ణోగ్రతలు
తెలంగాణలో మండిపోతున్న ఎండలు.. భానుడి సెగలతో అల్లాడుతున్న జనాలు
Telangana: తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి సెగలతో జనాలు అల్లాడుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఓ వైపు ఉక్కపోత మరో వేడిగాలులు వీస్తుండడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. పలు జిల్లాల్లో అయితే ఏకంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. మరో వైపు ఎండల తీవ్రత దృష్ట్యా తెలంగాణలోని 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. పలుచోట్ల జిల్లాల్లో యెల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. రాష్ట్రంలో వచ్చే మూడ్రోజులు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయంటోన్న వాతావరణశాఖ అధికారిని శ్రావణి.