ఆర్టీసీ జీతభత్యాలపై హైకోర్టు విచారణ 27కు వాయిదా

Update: 2019-11-25 10:43 GMT
తెలంగాణ హై కోర్టు

ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె నిరవధికంగా కొనసాగుతూనే ఉంది. ఈ నేపధ్యంలోనే ఆర్టీసీ కార్యికులు జీతభత్యాల పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ నిర్వహించారు. తదుపరి విచారణ ఈ నెల 27కు హైకోర్టు వాయిదా వేసింది. అయితే అడ్వకేట్ జనరల్ ప్రస్తుతం అందుబాటులో లేరని తమకు మరి కొంత సమయం కావాలని ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. దీంతో స్పందించిన పిటిషనర్ ఇప్పటికే 30 మంది కార్మికులు తమ ప్రాణాలను కోల్పోయారని, జీతాలు లేక ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

ఇదే సందర్భంలో ఇప్పటి వరకూ ప్రభుత్వం ఆర్టీసీలో తాత్కాలిక సిబ్బందిని నియమించడంతో జరిగిన ప్రమాదాలపై కూడా హైకోర్టులో విచారణ జరిపించారు. అనుభవం లేని తాతాల్కిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించడంతో చాలా ప్రమాదాలు జరిగాయని దాంతో చాలామంది తమ ప్రాణాలు కోల్పోయారని పిటిషనర్‌ పేర్కొన్నారు. ప్రమాదాలపై జరిపిన తదుపరి విచారణ నాలుగు వారాలకు కోర్టు వాయిదా వేసింది.



Tags:    

Similar News