మునిసిపల్ ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు..

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్ పడింది.

Update: 2020-01-06 14:18 GMT
హైకోర్టు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్ పడింది. రేపటివరకూ నోటిఫికేషన్ ఇవ్వొద్దని ఈసీకి హైకోర్టు ఆదేశాలుజారీ చేసింది. ఎన్నికల నియమావళిని తమ ముందు వుంచాలని న్యాయస్థానం కోరింది.తెలంగాణలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళలకు రిజర్వేషన్లు ఖరారు చేయకుండానే నోటిఫికేషన్ విడుదల చేయాలనుకోవడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో  కాంగ్రెస్ కమిటీ తరపున జంధ్యాల రవిశంకర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఈరోజు విచారణ జరిగింది.

అయితే నిబంధనలు పాటించకుండానే రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయాలని చూస్తోందని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఎన్నికల నియమావళిని న్యాయస్థానానికి సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. రేపు సాయంత్రం వరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయొద్దని ఆదేశించింది. ఈ కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది. కాగా, ఎన్నికల కమిషన్ ప్రకారం రేపు నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది.  

జనవరి 4 లోగా ఓటర్ల జాబితా పూర్తి చేస్తామన్న ఈసీ, డిసెంబర్ 23కే ఎలా పూర్తి చేసిందని ప్రశ్నించింది. పూర్తి చేసిన ఎన్నికల మ్యానువల్ కోర్టు సమర్పించాలని ఆదేశించింది. ఎన్నికల మ్యానువల్ అందుబాటులో లేకపోవడంతో ఈసీ తరపున న్యాయవాది గడువు కోరారు. ప్రతిసారి మ్యానువల్ విషయంలో తప్పులు చేయడం ఆలవాటైయిందని కోర్టు వ్యాఖ్యానింది. దీంతో కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది.


Full View


Tags:    

Similar News