Telangana: నల్గొండ కలెక్టర్‌ ప్రశాంత్ ‌జీవన్‌ పాటిల్‌కు హైకోర్టు షాక్‌

Telangana: నల్గొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్ ‌జీవన్‌ పాటిల్‌కు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది.

Update: 2021-04-07 11:57 GMT

ఇమేజ్ సోర్స్ (ది హన్స్ ఇండియా )

Telangana: నల్గొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్ ‌జీవన్‌ పాటిల్‌కు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో కలెక్టర్‌కు శిక్ష విధించింది. వారానికి 2రోజులు చొప్పున 6 నెలలపాటు అనాథాశ్రమంలో పని చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్ ‌జీవన్‌ పాటిల్‌ను ఆదేశించింది.

అలాగే, రిటైర్డ్ ఆఫీసర్ సంధ్యారాణికి కూడా హైకోర్టు శిక్ష విధించింది. ఉగాది, శ్రీరామనవమి రోజుల్లో అనాథాశ్రమంలో భోజనాలు వడ్డించాలని సంధ్యారాణికి ఆదేశించింది. గతంలో కోర్టు ధిక్కరణ కేసులో సింగిల్‌ జడ్జి ఇద్దరికి రూ.2వేల జరిమానా విధించారు. ఆ ఉత్తర్వులను కొట్టేయాలంటూ ధర్మాసనం ఎదుట అప్పీల్‌కు వెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు సామాజిక సేవ చేయాలని ఆదేశిస్తూ విచారణను ముగించింది.

Tags:    

Similar News