Heavy Rains: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం

Heavy Rains: హైదరాబాద్‌లో వాతావరణం మేఘావృతమైంది. మధ్యాహ్నం వరకు ఎండతో పొడిగా కనిపించన వెదర్...ఒక్కసారిగా మారిపోయి భారీ వర్షం కురుస్తోంది.

Update: 2025-09-22 11:12 GMT

Heavy Rains: హైదరాబాద్‌లో వాతావరణం మేఘావృతమైంది. మధ్యాహ్నం వరకు ఎండతో పొడిగా కనిపించన వెదర్...ఒక్కసారిగా మారిపోయి భారీ వర్షం కురుస్తోంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఎస్సార్‌నగర్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎల్బీనగర్, హయత్‌నగర్ అబ్దుల్లాపూర్‌మెట్‌‌లో వర్షం కుమ్మేస్తోంది. నగరంలోని మెయిన్‌రోడ్డపై భారీగా ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచింది.

రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ మాన్సూన్‌, హైడ్రా సిబ్బంది వాటర్‌ ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. ఫీక్‌ అవర్స్‌ కావడంతో గచ్చిబౌలి హైటెక్‌సిటీ, మాదాపూర్‌ రోడ్లపై భారీగా ట్రాఫిక్‌జామ్ అయ్యింది. మరో నాలుగు గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని చెబుతున్నారు. 

Tags:    

Similar News