తెలంగాణకు రెయిన్ అలర్ట్‌.. 14 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు

Weather Report: ఎల్లో అలర్ట్‌ జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ శాఖ

Update: 2022-10-09 13:10 GMT

తెలంగాణకు రెయిన్ అలర్ట్‌.. 14 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు

Weather Report: తెలంగాణలో ఈ నెల 14వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. రేపు ఉదయం వరకు జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు 16 ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Tags:    

Similar News