Hyd Rains: హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం..

Hyd Rains: జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌లో వర్షం

Update: 2023-09-14 11:42 GMT

Hyd Rains: హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం..

Hyd Rains: హైదరాబాద్‌ జంట నగరాల పరిధిలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. పొద్దంతా మేఘావృతమై ఉండగా.. సాయంత్రం ఒక్కసారిగా దట్టమైన మేఘాలు కమ్మేశాయి. మణికొండ, షేక్‌పేట, టోలీచౌకీ, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, బేగంపేట, మలక్‌పేట, షైక్‌పేట, మాదాపూర్‌, మెహదీపట్నం, రాయదుర్గం, గచ్చిబౌలి, బాలానగర్‌, కుత్బుల్లాపూర్‌, ఖైరతాబాద్‌, మసబ్‌ట్యాంక్‌ ఏరియాతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. అయితే, ఒక్కసారిగా కురిసిన వర్షంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. మరో వైపు రాబోయే ఒకటి, రెండు గంటల్లో హైదరాబాద్‌ నగరంలో పశ్చిమ, మధ్య, ఉత్తర హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Tags:    

Similar News