Rain Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం – జన జీవనానికి అంతరాయం
భాగ్యనగరంలో శనివారం భారీ వర్షం కురిసింది. బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్ బాగ్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, లక్డీకాపుల్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్ వంటి ప్రముఖ ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది.
Rain Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం – జన జీవనానికి అంతరాయం
Rain Alert: భాగ్యనగరంలో శనివారం భారీ వర్షం కురిసింది. బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్ బాగ్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, లక్డీకాపుల్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్ వంటి ప్రముఖ ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. దీంతో రహదారులపై నీరు చేరి, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. వర్షంలో తడిసి ముద్దైన నగరవాసులు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. వాహనదారులు, పాదచారులు నానా ఇబ్బందులు పడారు. చాలా చోట్ల వర్షపు నీరు నిలిచిపోయి రోడ్లు జలమయంగా మారాయి.