స్టేడియం కెపాసిటీ 55వేలు.. ప్రస్తుతం అందుబాటులో కేవలం 3వేల టికెట్లు

*2గంటలు గడిచినా వంద టికెట్లు కూడా విక్రయించని HCA

Update: 2022-09-22 09:05 GMT

స్టేడియం కెపాసిటీ 55వేలు.. ప్రస్తుతం అందుబాటులో కేవలం 3వేల టికెట్లు

Hyderabad: జింఖానా గ్రౌండ్స్‌లో టికెట్ల విక్రయాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్టేడియం కెపాసిటీ 55వేలు కాగా ప్రస్తుతం కేవలం 3వేల టికెట్ల మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో 3వేల టికెట్ల కోసం వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. అయితే 2 గంటలు గడిచినా వంద టికెట్లు కూడా HCA విక్రయించలేదని ఫ్యాన్స్ చెబుతున్నారు. మరోవైపు HCAలో ఉన్న గొడవల వల్లే టికెట్ల విక్రయంలో గందరగోళం నెలకొందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు లాఠీచార్జ్‌కు బాధ్యులు ఎవరు? భారీగా ఫ్యాన్స్ వస్తున్నారని తెలిసి కూడా సరైన ఏర్పాట్లు ఎందుకు చేయలేదు? అని ప్రశ్నిస్తున్నారు.

వాస్తవానికి ఈ టికెట్లపై మొదటి నుంచి గందరగోళం నడుస్తోంది. తొలుత అన్ని టికెట్లు అమ్ముడుపోయినట్లు HCA ప్రకటించింది. ఆ తర్వాత అభిమానులు నిరసన తెలపడంతో తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. దాంతో కంటితుడుపు చర్యల్లో భాగంగా 3 వేల టికెట్లని ఆఫ్‌లైన్‌లో అమ్మబోతున్నట్లు HCA ప్రకటించింది. అయితే.. మిగిలిన టికెట్లు ఏమైపోయాయి? బ్లాక్‌లో అధిక ధరకి అమ్మేసుకున్నారా? అని అభిమానులు మండిపడుతున్నారు. HCA పెద్దలు చెప్పినదాని ప్రకారం దాదాపు 9 వేల మందికి కాంప్లిమెంటరీ పాస్‌ల రూపంలో టికెట్లు ఇవ్వబోతున్నారు. మిగిలిన టికెట్లలో సగం ఆన్‌లైన్‌లో ఇప్పటికే అమ్ముడుపోగా.. ఓ 10 నుంచి 12 వేల టికెట్లపై లెక్కలు తేలడం లేదు. దాంతో HCA తీరుపై తెలంగాణ ప్రభుత్వం విచారణకి ఆదేశించింది.

Tags:    

Similar News