Harish Rao: వారికి గుర్తుగా మొక్కను నాటి.. స్మరించుకోండి..

Harish Rao: చనిపోయిన వారికి గుర్తుగా ఒక మొక్కను నాటి వారిని స్మరించుకోవాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

Update: 2022-08-18 11:52 GMT

Harish Rao: వారికి గుర్తుగా మొక్కను నాటి.. స్మరించుకోండి.. 

Harish Rao: చనిపోయిన వారికి గుర్తుగా ఒక మొక్కను నాటి వారిని స్మరించుకోవాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. పీవీ మార్గ్ లోని పీపుల్స్ ప్లాజాలో 12వ గ్రాండ్ నర్సరీ మేళాను ఆర్ధిక, వైద్యారోగ్యా శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఇవాళ్టి నుండి ఈనెల 22 వరకు ఈ మేళా జరగనుంది. ఈ గ్రాండ్ నర్సరీ మేళాలో వివిధ రాష్ట్రాలు 120కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు.

స్టాల్స్ లో 100కు పైగా అరుదైన మొక్కలు, విత్తనాలు, ఎరువులు, పరికరాలు ప్రదర్శనలో పెట్టారు. మేళా ప్రారంభించిన మంత్రి హరీష్ రావు చెట్ల పెంపకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. తెలంగాణ వచ్చాక 31.6 శాతం గ్రీనరి పెరిగిందన్నారు. అడవులను బ్రతికించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు.

Tags:    

Similar News