Harish Rao: ఆరోగ్యమహిళ కార్యక్రమాన్ని ప్రారంభించిన హరీష్‌రావు
Harish Rao: మహిళలకు 57 రకాల వైద్య పరీక్షలు
Harish Rao: ఆరోగ్యమహిళ కార్యక్రమాన్ని ప్రారంభించిన హరీష్‌రావు
Harish Rao: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి హరీష్ రావు ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణలో వంద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రారంభించామని, త్వరలోనే మరిన్ని ఆరోగ్యకేంద్రాలకు దీనిని విస్తరిస్తామని హరీష్ రావు అన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబమంతా ఆరోగ్యంగా ఉంటుందని హరీష్ రావు తెలిపారు. అన్నివయసుల మహిళలకు 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించనున్నట్టు హరీష్ రావు తెలిపారు.