Harish Rao: మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలకు హరీష్‌రావు కౌంటర్
Harish Rao: మీరు ఆధారాలతో రాకపోతే క్షమాపణ చెప్పాలి-
Harish Rao: మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలకు హరీష్‌రావు కౌంటర్
Harish Rao: అమెరికాలో ప్రభాకర్‌రావును కలిశారన్న మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్‌రావు స్పందించారు. కోమటిరెడ్డికి మతిభ్రమించిందని ఫైర్ అయ్యారు. కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లింది వాస్తమని.. అక్కడ ప్రభాకర్‌రావుని కలిసినట్లు నిరూపిస్తే అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాయడానికి సిద్ధమంటూ సవాల్ చేశారు హరీష్‌రావు. ఒకవేళ రుజువు చేయకపోతే కోమటిరెడ్డి ముక్కునేలకు రాస్తాడా అంటూ ప్రశ్నించారు. తాను ఎక్కడకు వెళ్లింది.. ఏ హోటల్‌లో ఉన్న వివరాలు ఇస్తానన్నారు. తన పాస్‌పోర్టుతో బహిరంగ చర్చకు రావడానికి సిద్ధమన్నారు. మంత్రి కోమటిరెడ్డి ఆధారాలతో రాకపోతే బహిరంగ క్షమాపణ చెప్పాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.