Harish Rao: పార్టీ గేట్లు కాదు..ప్రాజెక్టుల గేట్లు తెరవండి

Harish Rao: కాంగ్రెస్‌ 3 నెలల పాలనలో 180 మంది రైతుల ఆత్మహత్య చేసుకున్నారు

Update: 2024-03-25 10:10 GMT

Harish Rao: పార్టీ గేట్లు కాదు..ప్రాజెక్టుల గేట్లు తెరవండి

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సమస్యలను తీర్చడంలో విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. వడగళ్ల వానతో రైతులకు అపార నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మూడు నెలల పాలనలో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చేరికలపై దృష్టి పెడుతుంది తప్ప.. ప్రజల బాగోగులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ హయంలో ఇలాంటి దుస్థితి ఎన్నడూ లేదన్నారు. ఇక కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసిందన్నారు.

ఏ ముఖం పెట్టుకొని పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయమని ప్రజలను అడుగుతారని ప్రశ్శించారు. రైతుల మీద కంటే రాజకీయ ప్రయోజనాలపైనే కాంగ్రెస్ ఫోకస్ పెడుతుందని అన్నారు. తెరవాల్సింది పార్టీ గేట్లు కాదు.. ప్రాజెక్టుల గేట్లు అన్నారు. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని చెప్పారు. రేపటి నుంచి బీఆర్ఎస్ పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో పంట పొలాలను పరిశీలిస్తారని హరీష్ రావు చెప్పారు. రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే సచివాలయం ముట్టడిస్తామని హరీష్ రావు హెచ్చరించారు.

Tags:    

Similar News