Harish Rao: బీజేపీ నాయకులు నూకలు బుక్కమని.. మోటార్లకు మీటర్లు పెట్టమన్నారు
Harish Rao: ప్రాజెక్టుల కోసం రైతులు భూములు ఇవ్వకుండా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి
Harish Rao: బీజేపీ నాయకులు నూకలు బుక్కమని.. మోటార్లకు మీటర్లు పెట్టమన్నారు
Harish Rao: సిద్ధిపేట జిల్లా రూరల్ మండలం ఇర్కొడ్ బంజెరుపల్లి గ్రామాల్లో దేవాలయాల వార్షికోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు మంత్రి హరీష్‌రావు. ఈ యాసంగిలో బీజేపీ ప్రభుత్వం వడ్లు కొనకపోయినా తెలంగాణ ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేసిందన్నారు. ప్రాజెక్టుల కోసం రైతులు భూములు ఇవ్వకుండా ప్రతిపక్షాలు అడ్డుకుని కోర్టులో కేసులు వేశారన్నారు. మల్లన్న ఆశీస్సులతో ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయన్న ఆయన కాళేశ్వరం పుణ్యమా అని నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయని తెలిపారు. బీజేపీ నాయకులు నూకలు బుక్కమని.. మోటార్లకు మీటర్లు పెట్టామన్నారన్నారు. కానీ సీఎం కేసీఆర్ ప్రజల కష్టాలను తెలుసుకున్న ప్రజా నాయకుడిగా ఆ పని చేయలేదన్నారు మంత్రి హరీష్‌రావు.