Hyderabad: హైదరాబాద్‌లో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సోదాలు
Hyderabad: హైదరాబాద్ కేంద్రంగా బయటపడ్డ ఉగ్రకుట్ర కేసులో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సోదాలు చేస్తున్నారు.
Hyderabad: హైదరాబాద్ కేంద్రంగా బయటపడ్డ ఉగ్రకుట్ర కేసులో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సోదాలు చేస్తున్నారు. రాజేంద్రనగర్‌లో, పోర్ట్ వ్యూ కాలనీలో ఐదుగురు బృందాలు తనిఖీలు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ప్రధాన నిందితుడు డాక్టర్ అహ్మద్ నివాసంలో గంటన్నరకు పైగా సోదాలు చేశారు. నిందితుడి ఇంట్లో రైసిన్ విష పదార్థం తయారీ ఉపయోగించిన ముడిపదార్థాలను, కోల్డ్ ప్రెస్ మిషన్, కంప్యూటర్, పలు పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో సంబంధం ఉన్న యూపీకి చెందిన అజాద్, సలీంఖాన్ ఇళ్లలోనూ తనిఖీలు చేశారు. ఆన్లైన్ ద్వారా ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడినప్పటి నుంచి.. అహ్మద్ తీవ్రవాద సంస్థకు పనిచేస్తున్నట్లు యాంటీ టెర్రరిస్ట్ స్వాడ్ అధికారులు గుర్తించారు.