Harish Rao: వారికి కూడా రూ.లక్ష సాయం.. రెండు, మూడు రోజుల్లో ఉత్త‌ర్వులు..

Harish Rao: రాష్ట్రంలోని మైనార్టీలకు మంత్రి హరీష్ రావు గుడ్ న్యూస్ చెప్పారు.

Update: 2023-07-20 11:07 GMT

Harish Rao: వారికి కూడా రూ.లక్ష సాయం.. రెండు, మూడు రోజుల్లో ఉత్త‌ర్వులు..

Harish Rao: రాష్ట్రంలోని మైనార్టీలకు మంత్రి హరీష్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే పేద మైనార్టీలకు రూ.లక్ష సాయం అందిస్తామని ఆయన తెలిపారు. బ్యాంకుల‌తో సంబంధం లేకుండా ఈ ఆర్థిక సాయం అంద‌జేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. మైనార్టీల‌కు ఆర్థిక సాయంపై ఇప్ప‌టికే సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చార‌ని తెలిపారు. మైనార్టీల‌కు ఆర్థిక సాయం అందించే కార్య‌క్ర‌మంపై రెండు, మూడు రోజుల్లో ఉత్త‌ర్వులు జారీ చేస్తామ‌ని మంత్రి హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. కాగా ఇప్పటికే బీసీలోని చేతి, కులవృత్తిదారులకు రూ.లక్ష సాయాన్ని అందిస్తుండగా..మైనార్టీలకు కూడా ఈ సాయం అందించేలా చూస్తుంది.

దేశంలో ఇప్ప‌టికీ ముస్లింలు పేద‌వారిగానే ఉన్నారు.. ఇదంతా కాంగ్రెస్ పార్టీ పాల‌న వ‌ల్లే అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌లో రూ. 2,200 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టామ‌న్నారు. ఒక్క సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రప్రభుత్వం పెట్టిన బడ్జెట్ కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలలో కూడా పెట్టలేదని గుర్తు చేశారు. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో ఇంగ్లీష్ మీడియంతో పాటు ఉర్దూ మీడియం కూడా అందుబాటులో ఉంద‌ని మంత్రి హ‌రీశ్‌రావు తెలిపారు. మైనార్టీ విద్యార్థులు డాక్టర్లు, ఇంజినీర్లుగా ఎదుగుతున్నార‌ని పేర్కొన్నారు.

Tags:    

Similar News