Governor: ఆర్టీసీ ఆస్తులు, అప్పుల వివరాలు కోరిన గవర్నర్
Governor: ఆర్టీసీ బిల్లుపై మరిన్ని వివరాలు అడిగిన గవర్నర్
Governor: ఆర్టీసీ ఆస్తులు, అప్పుల వివరాలు కోరిన గవర్నర్
Governor: తెలంగాణ ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ.. ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుపై గవర్నర్ తమిళిసై మరికొన్ని సందేహాలు లేవనెత్తారు. ఇప్పటికే బిల్లుపై కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వ సీఎస్ శాంతికుమారికి లేఖ రాసిన గవర్నర్.. మరిన్ని వివరాలు కావాలని తాజాగా పేర్కొన్నారు. బిల్లులోని ఐదు అంశాలపై ఇప్పటికే వివరణ కోరారు. సందేహాలను నివృత్తి చేస్తే.. రెండు గంటలలోనే ఆమోద ముద్ర వేస్తానని ఓ ప్రకటన విడుదల చేశారు.
ఆర్టీసీ కార్మికుల భద్రత, ప్రయోజనాలపై స్పష్టమైన హామీలను గవర్నర్ తమిళిసై కోరారు. విలీనం తర్వాత ఉద్యోగుల పరిస్థితిపై గవర్నర్ ఆరా తీశారు. ఆర్టీసీ ఆస్తులు, అప్పుల వివరాలను గవర్నర్ కోరారు. అలాగే.. కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎలా సర్దుబాటు చేస్తారని ప్రశ్నించారు. ఈ అంశాలను లేవనెత్తుతూ.. కాసేపట్లో తెలంగాణ ప్రభుత్వానికి నోట్ పంపనుంది రాజ్‌భవన్.