Gopalapuram PS: ఇన్‌స్పెక్టర్, ఎస్సైపై సస్పెన్షన్ వేటు
Gopalapuram PS: అలసత్వం వహించిన కారణంగా సస్పెండ్
Gopalapuram PS: ఇన్‌స్పెక్టర్, ఎస్సైపై సస్పెన్షన్ వేటు
Gopalapuram PS: సికింద్రాబాద్‌లోని గోపాలపురం పీఎస్‌లో పోలీసు సిబ్బందిపై వేటు పడింది. సీఐ మురళీధర్‌తో పాటు ఎస్సై దీక్షిత్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేస్తూ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసు విషయంలో సస్పెండ్ చేశారు. రెండు నెలల క్రితం గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రియల్టర్ హత్య జరగ్గా.. విచారణలో ఇన్‌స్పెక్టర్ మురళీధర్, ఎస్సై దీక్షిత్‌లు అలసత్వం వహించారని..అందుకే సస్పెండ్ చేసినట్లు సీపీ తెలిపారు.