సీఎం రేవంత్‌ను కలిసిన గూగుల్ వైస్ ప్రెసిడెంట్

*సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన చంద్రశేఖర్‌ తోట

Update: 2024-01-11 07:16 GMT

సీఎం రేవంత్‌ను కలిసిన గూగుల్ వైస్ ప్రెసిడెంట్

Revanth Reddy: గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులపై గూగుల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ చంద్రశేఖర్‌ తోట సీఎంతో చర్చించి ప్రభుత్వంతో కలిసి పనిచేయండనికి సంసిద్ధతను వ్యక్తం చేసారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తోంది. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి అంశాలలో తెలంగాణ కోసం డిజిటలైజేషన్‌తో పాటు పౌరుల అవసరాలను తీర్చడం కోసం నాణ్యమైన సేవలను అందించే సాంకేతిక నైపుణ్యం తమ వద్ద ఉందని చంద్రశేఖర్‌ సీఎం రేవంత్‌రెడ్డికి వివరించారు. గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి సాధ్యమయ్యే రహదారి భద్రత పై కూడా సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News