జనవరిలో పసుపు రైతులు శుభవార్త వింటారు : అరవింద్

Update: 2019-12-13 10:54 GMT
ధర్మపురి అరవింద్

పసుపు రైతులు జనవరిలో శుభవార్త వింటారన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. పసుపు బోర్డును మించిన ప్రయోజనాలు కల్పించే విధంగా అడుగులు పడుతున్నాయని చెప్పారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎప్పడి నుంచో ఉండగా పసుపు బోర్డును మించిన ప్రయోజనాలు కల్పించే దిశగా అడుగులు పడుతున్నాయని తెలిపారు ఎంపీ అరవింద్ మీడియాతో మాట్లాడిన ఆయన అరవింద్ గట్టి నెగోషియేటర్ అనే విషయం నిరూపిస్తాను, సాధించి చూపిస్తానన్నారు. పసుపు దిగుమతి నిలిపివేయాలని కేంద్రాన్ని కోరామని ఇందుకు కేంద్రం సానుకూలంగా ఉందని తెలిపారు.

పసుపు జాతీయస్థాయిలో సాగుచేసే పంట కాదు అయినా సరే పసుపు పంటకు మద్ధతు ధర కల్పించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. అయితే, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు రావాలి కానీ, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం పసుపు మద్ధతు ధరపై ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రతిష్టాత్మక ఐఐఎం, ఐఐఎస్‌ఈఆర్‌ కేటాయించాలని హెచ్‌ఆర్డీ మంత్రిని కోరామని తెలిపారు. అందుకు మంత్రి కూడా సానుకూలంగా స్పందించారన్నారు. పార్లమెంట్‌ సమావేశాల చివరి రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా పసుపు రైతుల కష్టాలు, మద్దతు ధరపై ఎంపీ అరవింద్‌ ఇవాళ కేంద్రమంత్రులు అమిత్‌ షా, పియూష్‌ గోయల్‌ను కలిశారు. విదేశాల నుంచి పసుపు దిగుమతి నిలిపివేయాలని రైతులను ఆదుకోవాలని ఆయన ఈ సందర్భంగా కేంద్రమంత్రులను కోరారు. 

Tags:    

Similar News