నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి ఉగ్రరూపం.. క్షణం క్షణం పెరుగుతున్నా వరద ప్రవాహం
నిర్మల్ జిల్లా బాసర దగ్గర గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. క్షణం క్షణం వరద ప్రవాహం పెరుగుతోంది.
నిర్మల్ జిల్లా బాసర దగ్గర గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. క్షణం క్షణం వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువన మహారాష్ట్రతో పాటు తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. గోదావరి పరివాహక ప్రాంతాలలో వేలాది ఎకరాలు, పుష్కర ఘాట్లు, నిత్యహరతి శివలింగాలు నీట మునిగాయి. ఒక ఘాట్ వద్ద మాత్రమే భక్తుల పుణ్యస్నానాలకు అధికారులు అనుమతి ఇచ్చారు. గోదావరి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లొతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.