Godavari River Flood Alert: భద్రాచలం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ..
Godavari River Flood Alert: భద్రాచలం వద్ద గోదావరి వరద నీటిమట్టం 48 అడుగులకు చేరడంతో రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు.
Godavari River Flood Alert: భద్రాచలం వద్ద గోదావరి వరద నీటిమట్టం 48 అడుగులకు చేరడంతో రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. దీంతో భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అటు ఆంధ్ర కూనవరం, వీఆర్ పురం, చింతూరు మండల మండలాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. సీతవాగు పొంగడంతో స్వామివారి నారచీరల ఆనవాళ్లు పూర్తిగా నీట మునిగాయి.
అయితే ఎగువన ఉన్న సరస్వతి బ్యారేజ్ 66 గేట్లు ఓపెన్ చేసి 7,91,444 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. అలాగే మేడిగడ్డ ప్రాజెక్టు 85 గేట్లు ఎత్తి 11,37,540 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దీంతో గోదావరి ఇంకా పెరిగే అవకాశం ఉంది.