Nagarkurnool: హరితహారం మొక్కను మేసిన మేక.. మేకకు ఐదు వేల రూపాయల ఫైన్..

Nagarkurnool: హరితహారంలో భాగంగా నాటిన మొక్కను తినేసిందని మేకను బంధించిన ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.

Update: 2021-07-03 14:23 GMT

హరితహారం మొక్కను మేసిన మేక

Nagarkurnool: హరితహారంలో భాగంగా నాటిన మొక్కను తినేసిందని మేకను బంధించిన ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. ఏడవ హరితహారంలో భాగంగా నిన్న కొల్లాపూర్‌ మున్సిపాలిటీలో అధికారులు మొక్కలను నాటారు. 4 నెలల మేక పిల్ల ఓ చెట్టును తినేసింది. దాంతో అధికారులు మేకను రూంలో బంధించి, తాళం వేశారు.

మేక పొరపాటున తినేసిందని వదలిపెట్టాలని యజమాని రంగస్వామి మున్సిపల్ అధికారులను వేడుకున్నారు. అయినా అధికారులు ఒప్పుకోలేదు. 5వేల రూపాయల జరిమానా విధించారు. మేక అమ్మినా అంత రాదని యజమాని రంగస్వామి వాపోయారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను జంతువులు, పశువులు తింటే వాటి యజమానులకు జరిమానాలు విధిస్తామని మున్సిపల్ కమిషనర్ విక్రమ్‌ సింహారెడ్డి హెచ్చరించారు.

Tags:    

Similar News