Ganesh Idol Immersion 2025: గణేష్ నిమజ్జనానికి కృత్రిమ కొలనులు.. GHMC టెండర్ నోటిఫికేషన్ జారీ

Ganesh Idol Immersion in Hyderabad: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి ఈ సారి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరగనున్నాయి. ఇందులో భాగంగా నిమజ్జనం కోసం ఎక్కడక్కడ కృత్రిమ కొలనులను ఏర్పాటు చేయనున్నారు.

Update: 2025-07-03 06:51 GMT

Ganesh Idol Immersion 2025: గణేష్ నిమజ్జనానికి కృత్రిమ కొలనులు.. GHMC టెండర్ నోటిఫికేషన్ జారీ

Ganesh Idol Immersion in Hyderabad: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి ఈ సారి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరగనున్నాయి. ఇందులో భాగంగా నిమజ్జనం కోసం ఎక్కడక్కడ కృత్రిమ కొలనులను ఏర్పాటు చేయనున్నారు. దీనికి ఆసక్తి ఉన్నవారికోసం జిహెచ్ఎమ్‌సి టెండర్ నోటిఫికేషన్ ప్రకటించింది.

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి ఎక్కువ క్రేజ్. లక్షల సంఖ్యలో వినాయకుడులు నిమజ్జనం రోజు హుస్సేన్‌ సాగర్‌‌కు తరలివస్తాయి. అయితే దీంతో ట్రాఫిక్ ఇబ్బుందులు అదేవిధంగా వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని జిహెచ్‌ఎమ్‌సి సరికొత్త నిర్ణయానికి వచ్చింది. నిమజ్జనం ముందస్తు ఏర్పాట్లలో భాగంగా కృత్రిమ కొలనుల ఏర్పాటుకు ఆసక్తి ఉన్నవారికోసం టెండర్‌‌ నోటిఫికేషన్‌ను ప్రకటించింది. 10 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల పొడవు, 1.32 మీటర్ల లోతుతో ఉండే పీవీపీ పోర్టబుల్ పాండ్‌లు అవసరమని టెండర్‌‌లో వివరించింది. ఈ పాండ్‌లలో దాదాపు 2.36 లక్షల లీటర్లు నీరు పట్టే సామర్ధ్యం ఉంటుంది.

మొదట విడత కోసం సికింద్రాబాద్ జోన్‌ పరిధిలో దాదాపు 50 కొలనుల ఏర్పాటుకోసం బిడ్‌లు ఆహ్వానించారు. ఆతర్వాత ఇతర జోన్లలోని అవసరమాన్ని బట్టి కొలనుల ఏర్పాటు ఉంటుంది. అయితే ప్రతి ఏడాది భారీ ఎత్తున వినాయకుడి నిమజ్జనాలు జరుగుతాయి. ఈ సారి అది మరికొంత పెరిగే అవకాశం ఉంది. అందుకే ముందస్తు చర్యల్లో భాగంగా ఆర్టిఫిషియల్ పాండ్‌లను అధికారులు సిద్దం చేయాలనుకుంటున్నారు. ఆగష్టు 27న వినాయక చవితి. అదేవిధంగా సెప్టెంబర్ 6న నవరాత్రి పూజల అనంతరం సామూహిక నిమజ్జనం జరిగే అవకాశం కూడా ఉంది. దీంతో ముందస్తుగా ఏర్పాట్లను మొదలుపెట్టారు.

Tags:    

Similar News