GHMC స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం

GHMC: మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో సమావేశం

Update: 2022-03-10 11:38 GMT

GHMC స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం

GHMC: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ లో స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. నగరంలో అబివృద్ది పనులకు అవసరమైన నిదుల విడుదల పై చర్చించారు. ఈ సారి జరిగిన 6 వ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పలు అంశాలకు కమిటీ ఆమోదం తెలిపింది. నగరంలో రోడ్లను వెడల్పు చేసేందుకు ఈ సారి ప్రాదాన్యత ఇచ్చారు.నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో 116 అంశాలపైచర్చించి తీర్మానం చేశారు. హైదరాబాద్ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కావాల్సిన అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

ప్రస్తుతం ఆమోదించిన 116 అంశాల్లో రోడ్డు వెడల్పు కోసం స్థల సేకరణ, వైకుంఠ దామాలు, చెరువుల పటిష్టత, మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్స్ నిర్మాణానికి సంబంధించినవి ఉన్నాయి. ప్రదానంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ క్రింద మూసాపేట్ విలేజ్ ముండ్ల కత్వ చెరువు అభివృద్ధి, శేర్ లింగంపల్లి లో గురునాథ్ చెరువు పరిరక్షణ పనులను యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ కు ఇచ్చేందుకు 24 నెలల కాలానికి ఎంఓయూ చేయనున్నారు.

గచ్చిబౌలి ఖాజాగూడ లో 3 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మోడల్ గ్రేవ్ యార్డ్ నిర్మించనున్నారు. రహమత్ నగర్ పీజేఆర్ నుంచి ప్రతిపాదించిన 24 మీటర్ల వెడల్పుతో జంక్షన్ విస్తరణకోసం స్థల సేకరణకు ఆమోదం తెలిపారు. చాంద్రాయణగుట్ట కేశవగిరి జంక్షన్ నుండి ఆరాంఘర్ జంక్షన్ వరకు రోడ్డు వెడల్పు కు ఆస్తుల సేకరణకు ఆమోదం తెలిపారు.స్వచ్ఛ సర్వేక్షన్ 2022 ర్యాంకు కోసం పబ్లిక్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద పబ్లిక్ నోటిస్ ద్వారా 75 మైక్రాన్ ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ ను నిషేధించేందుకు కమిటీ ఆమోదం తెలిపింది. దీనితో మరోసారి హైదరాబాద్ లో ప్లాస్టిక్ నిషేదం పై దృష్టి పెట్టనున్నారు. ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఆదాయం, ఖర్చుల వివరాలను సభ్యులకు వివరించారు.

Tags:    

Similar News