GHMC: రూ.5కే టిఫిన్.. ఏర్పాట్లు చేస్తోన్న జిహెచ్ఎంసీ..
GHMC: ఇందిరమ్మ క్యాంటీన్లలో అల్పాహారం రూ. 5లకే అందించాలని జిహెచ్ఎంసీ నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలుపెట్టింది.
GHMC: రూ.5కే టిఫిన్.. ఏర్పాట్లు చేస్తోన్న జిహెచ్ఎంసీ..
GHMC: ఇందిరమ్మ క్యాంటీన్లలో అల్పాహారం రూ. 5లకే అందించాలని జిహెచ్ఎంసీ నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఇప్పటివరకు మధ్యాహ్నం భోజనం అందించినట్లు ఇక నుంచి అల్పాహారం ( టిఫిన్) కూడా జిహెచ్ఎంసీ అందించనుంది.
హరే కృష్ణ మూవ్ మెంట్ భాగస్వామ్యంలో జిహెచ్ఎంసీ ఇక నుంచి అల్పాహారం కూడా అందించాలని నిర్ణయించింది. దీనికోసం గ్రేటర్‌లో 150 కేంద్రాల్లో త్వరలో పలు రకాల టిఫిన్లు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటివరకు రూ.5 లకు భోజనం అందించేవారు. ఇక నుంచి అల్పాహారం కూడా రూ. 5లకే ఇవ్వనున్నారు.
ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు టిఫిన్లు ఇందిరమ్మ క్యాంటీన్లలో అందుబాటులో ఉంటాయి. ఇడ్లీ, ఉప్మా, పొంగల్, పూరి, వడ వంటివి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అయితే ఒక్కో అల్పాహారానికి అయ్యే ఖర్చు రూ.19 అయితే.. ఇందులో రూ.5లు లబ్ధిదారుల దగ్గర తీసుకుని మిగిలిన రూ.14లు జిహెచ్ఎంసీ భరించనుంది.
ఉదయం పూట అల్పాహారాన్ని అందించేందుకు జిహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్లను ఆధునీకరిస్తున్నారు. 10/40 పరిమాణంలో 60 కేంద్రాలు, 10/20 పరిమాణంలో 79 కేంద్రాలు రెడీ అవుతున్నాయి. వీటికి రూ.11.29 కోట్లు ఖర్చు అవుతుంది. మరో 11 కేంద్రాలను ఇందిరమ్మ క్యాంటీన్లుగదా మార్చేందుకు రూ.13.75 లక్షలు ఖర్చు చేస్తున్నారు. మొత్తంగా క్యాంటీన్ల ఏర్పాటుకు 11.43 కోట్లు ఖర్చు కానుంది.