భిక్షాటన చేసే వారికి కేంద్రం గుడ్ న్యూస్...

పట్టణాల్లో రోజు రోజుకి భిక్షాటన చేసేవారి సంఖ్య పెరిగిపోతుంది. నగరంలోని ప్రధాన కూడల్ల వద్ద, ట్రాఫిక్ సిగ్నల్ల వద్ద ఎక్కువగా కనిపిస్తుంటారు.

Update: 2020-02-22 13:56 GMT
Representational Image

పట్టణాల్లో రోజు రోజుకి భిక్షాటన చేసేవారి సంఖ్య పెరిగిపోతుంది. నగరంలోని ప్రధాన కూడల్ల వద్ద, ట్రాఫిక్ సిగ్నల్ల వద్ద ఎక్కువగా కనిపిస్తుంటారు. అంతే కాక ఆలయాల వద్ద కూడా ఎంతో మంది భిక్షం ఎత్తుకునే వారు ఉంటున్నారు. పండగ సమయాల్లో చూసుకుంటే ఆలయాల వద్ద వారి తాడికి ఎక్కువగా ఉంటుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయానికొచ్చింది. దేశాన్ని భిక్షాటన రహిత దేశంగా మార్చడానికి ఓ కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చింది.

ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో శనివారం జీహెచ్ఎంసీ అధికారులు, ఎన్‌జీవో లతో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో బిక్షాటనలో వున్న వ్యక్తులకు గౌరవప్రదమైన పునరావాసం కల్పించడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలనే అంశంపై చర్చించారు. ఈ సదస్సులో నగర డిప్యూటీ మేయర్ మహమ్మద్ బాబా ఫసియుద్దీన్, కేంద్ర సామాజిక న్యాయశాఖ సంయుక్త కార్యదర్శి రాధిక చక్రవర్తి, రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, ఎన్జీవోలు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర సామాజిక న్యాయశాఖ కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి పైలట్ ప్రాజెక్టు క్రింద జీహెచ్ఎంసీని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. నగరంలో బిక్షాటన చేసే వారికి పూర్తి స్థాయిలో పునరావాసం, ఆర్థిక స్వావలంబన కల్పించాలని భావిస్తున్నామన్నారు. అంతే కాదు బిక్షాటన చేసే వారికి అనువైన వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చి, వారికి సరైన పనిని కల్పించి హైదరాబాద్ నగరాన్ని బిక్షాటన రహితంగా చేయనున్నారని తెలిపారు. ఇందులో భాగంగా మార్కెటింగ్ టై అప్ చేసుకోనున్నారు.

Tags:    

Similar News