Gadwala Vijayalakshmi (File Image)
హైదరాబాద్ టీఆర్‌ఎస్ మేయర్ అభ్యర్థిగా ఖరారైన గద్వాల విజయలక్ష్మి సీనియర్ ఎంపీ కేకే కూతురు. బంజారాహిల్స్ కార్పొరేటర్ గా రెండోసారి ఆమె విజయం సాధించారు. జర్నలిజం బీఏ, ఎల్‌ఎల్‌బీ చదివారు. అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీలో పరిశోధన సహాయకురాలు పనిచేశారు. 2007లోస్వదేశం తిరిగొచ్చారు. రాజకీయాల్లో చేరేందుకు నిర్ణయించుకున్న ఆమె అమెరికా పౌరసత్వం వదులుకున్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన గద్వాల విజయలక్ష్మి బాబీరెడ్డిని పెళ్లి చేసుకున్నారు.