Gachibowli: పశు సంవర్ధక శాఖలో నిధుల మళ్లింపు కేసు

Gachibowli: దర్యాప్తులో మరిన్ని వివరాలు వెల్లడవుతాయన్న గచ్చిబౌలి పోలీసులు

Update: 2024-01-06 12:00 GMT

Gachibowli: పశు సంవర్ధక శాఖలో నిధుల మళ్లింపు కేసు 

Gachibowli: పశు సంవర్ధక శాఖలో నిధుల మళ్లించినట్టు గచ్చిబౌలి పీఎస్‌లో కేసు నమోదైంది. 2 కోట్ల 10 లక్షల నిధులను దారి మళ్లించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు రవికుమార్, కేశవ సాయి, మరో ఇద్దరు కాంట్రాక్టర్లపై కేసులు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 406, 409, 420 కింద కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులో మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ హస్తం ఉందని అనుమానం వ్యక్త మవుతున్నాయి. దర్యాప్తులో మరిన్ని వివరాలు వెల్లడవుతాయని గచ్చిబౌలీ పోలీసులు తెలిపారు.

గొర్రెలు పెంపకం దారుల అకౌంట్లకు వెళ్లాల్సిన డబ్బులను దారి మళ్లించారని.. గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు బాధితులు. మధ్యవర్తితో పశుసంవర్ధక శాఖ అధికారులు కుమ్మక్కై.. తమకు రావలసిన 2 కోట్ల 10 లక్షలు నిధులను మళ్ళించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. గుంటూరులో 133 గొర్రెల యూనిట్లను కొనుగోలు చేసి అకౌంట్లో డబ్బులు వేయకుండా మోసం చేశారని ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఏడాదిన్నర కాలంగా న్యాయం చేయాలని... డబ్బులు చెల్లించాలని అధికారుల చుట్టూ తిరిగినా.. ఫలితం లేకపోవడంతో.. పోలీసులను ఆశ్రయించారు బాధితులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పశుసంవర్ధక శాఖకు చెందిన ఇద్దరు అధికారులతో పాటు ఓ మధ్యవర్తిపై కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News