భద్రాచలం కుర్రాడు.. హాలీవుడ్‌లో దర్శకుడు కొండపల్లి వివేకానంద

ఎక్కడ భద్రాచలం..ఎక్కడ హాలీవుడ్‌. రెండింటి మధ్య ఉన్న వేల కిలోమీటర్ల దూరాన్ని తన ప్రతిభతో చెరిపేస్తూ..తెలంగాణ యువకుడు హాలీవుడ్‌లో దర్శకుడిగా అరంగేట్రం చేశారు.

Update: 2025-10-30 09:17 GMT

భద్రాచలం కుర్రాడు.. హాలీవుడ్‌లో దర్శకుడు కొండపల్లి వివేకానంద

ఎక్కడ భద్రాచలం..ఎక్కడ హాలీవుడ్‌. రెండింటి మధ్య ఉన్న వేల కిలోమీటర్ల దూరాన్ని తన ప్రతిభతో చెరిపేస్తూ..తెలంగాణ యువకుడు హాలీవుడ్‌లో దర్శకుడిగా అరంగేట్రం చేశారు.ఎక్కడ భద్రాచలం..ఎక్కడ హాలీవుడ్‌. రెండింటి మధ్య ఉన్న వేల కిలోమీటర్ల దూరాన్ని తన ప్రతిభతో చెరిపేస్తూ..

తెలంగాణ యువకుడు హాలీవుడ్‌లో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ‘ద లాస్ట్‌ విజిల్‌’ అనే సినిమాకు దర్శకత్వం వహించడం ద్వారా భద్రాచలానికి చెందిన వివేకానంద కొండపల్లి(34) ఆ ఘనత సాధించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబరులో విడుదల కానుంది. యూట్యూబ్‌లో ట్రైలర్‌ విడుదల చేయగా రెండు రోజుల్లో 3 లక్షల మంది వరకు వీక్షించారు.

భద్రాచలం శిల్పినగర్‌ కాలనీకి చెందిన కొండపల్లి మహేశ్‌-జమునారాణిల పెద్ద కుమారుడు వివేకానంద. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. చదువు పూర్తయ్యాక..అక్కడే ఓ సంస్థలో ఉద్యోగం సాధించారు. తెలుగమ్మాయిని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం న్యూయార్క్‌లో భార్య పిల్లలతో కలిసి ఉంటున్నారు. ఇంటెలిజెన్స్‌ ఎస్సైగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన తండ్రి మహేశ్‌ స్వతహాగా గాయకుడు. తండ్రి స్ఫూర్తితో పాటలు పాడటం, కథలు రాయడం అలవాటుగా మార్చుకున్న వివేకానంద..రెండేళ్ల కిందట న్యూయార్క్‌లోని ఓ చిత్ర సంస్థలో శిక్షణ తీసుకున్నారు. ఆ అనుభవంతో అక్కడి నటీనటులకు కథలు వినిపించి.. వారిని మెప్పించి ‘ద లాస్ట్‌ విజిల్‌’కు చిత్రానికి దర్శకత్వం వహించారు. అంతకుముందు ‘తుల’ పేరిట తెలుగు లఘు చిత్రానికి మాటలు అందించారు. హాలీవుడ్‌లో మరో రెండు లఘు చిత్రాలకు దర్శకత్వం వహించి మన్ననలు అందుకున్నారు. ద లాస్ట్‌ విజిల్‌ సినిమాలో బ్రెట్‌ కలెన్, కేథరిన్‌ కర్టిన్‌ వంటి నటులు నటించారు. 95 నిమిషాల నిడివిగల ఈ చిత్రాన్ని ఉన్నత సాంకేతిక విలువలతో దాదాపు 1.3 మిలియన్‌ డాలర్లు (సుమారు 11.48 కోట్లు) వెచ్చించి చిత్రీకరించాం.

ప్రపంచ వ్యాప్తంగా 300 థియేటర్లలో క్రిస్మస్‌కు విడుదల చేయాలని భావిస్తున్నాం. త్వరలో మరో హాలీవుడ్‌ చిత్రానికి దర్శకత్వం వహించే అంశం చర్చల దశలో ఉంది. ఇది పూర్తయ్యాక తెలుగు చిత్రానికి దర్శకత్వం చేయాలని అనుకుంటున్నా.

Tags:    

Similar News