Hyderabad: దంపతుల ఘరానా మోసం.. ఏకంగా రూ.40 కోట్లకు టోకరా

Hyderabad: హైదరాబాద్ సీపీఎస్ పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

Update: 2023-09-03 05:12 GMT

Hyderabad: దంపతుల ఘరానా మోసం.. ఏకంగా రూ.40 కోట్లకు టోకరా

Hyderabad: హైదరాబాద్‌లో ఏలూరు జిల్లాకు చెందిన దంపతులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఏకంగా 40 కోట్ల రూపాయాలకు టోకరా పెట్టారు. విద్యాసంస్థల్లో పెట్టుబడుల పేరిట భారీ మోసానికి తెర తీశారు. ఏలూరులోని శ్రీ హర్షిత విద్యాసంస్థలకు రాణీ, ధర్మరాజు దంపతులు యజమానులుగా కొనసాగుతున్నారు. అయితే తమ సంస్థలో పెట్టుబడి పెడితే పార్ట్‌నర్ షిప్ ఇస్తామంటూ హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త నుంచి దాదాపు ఏడు కోట్ల రూపాయాలు వసూలు చేశారు.

లాభాల్లో వాటా ఇవ్వకపోగా చంపుతామంటూ బెదిరించారని బాధితుడయిన వ్యాపారవేత్త శ్రీనివాస్‌ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 35 మంది దగ్గర దంపతులు 40 కోట్ల రూపాయల మేర వసూలు చేసినట్లు విచారణలో గుర్తించారు. దంపతులు రాణి, ధర్మరాజును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Tags:    

Similar News