KTR: మీడియా ముందు నాకు, సీఎంకు లై డిటెక్టర్‌ చేయించండి

Formula E Scam Case: ఫార్ములా- ఈ కేసుపై కేటీఆర్ స్పందించారు. ఈ కేసులో ఏమీ లేదు... అదో లొట్ట పీసు కేసు అని విమర్శించారు.

Update: 2025-09-10 06:08 GMT

KTR: మీడియా ముందు నాకు, సీఎంకు లై డిటెక్టర్‌ చేయించండి

Formula E Scam Case: ఫార్ములా- ఈ కేసుపై కేటీఆర్ స్పందించారు. ఈ కేసులో ఏమీ లేదు... అదో లొట్ట పీసు కేసు అని విమర్శించారు. ఈ కేసులో ఒక్క రూపాయి కూడా తారుమారు కాలేదన్నారు. ప్రతి రూపాయికి లెక్క ఉంటే.. అవినీతి నిరోధకం ఎక్కడని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రాసిక్యూషన్ చేసినా.. ఛార్జ్‌షీట్లు వేసినా ఏమీ చేయలేరన్నారు కేటీఆర్. సీఎం రేవంత్‌కు, తనకు లైడిటెక్టర్ పరీక్ష నిర్వహించాలని ప్రస్తావించారు కేటీఆర్.

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో క్విడ్ ప్రోకో ఉన్నట్టు ఏసీబీ నిర్ధారణకు వచ్చింది. 9 నెలలపాటు కేసులో జరిగిన సుదీర్ఘ విచారణలో పలు విషయాలను గుర్తించింది. ఈ రేసు నిర్వహణ క్రమంలో HMDAకు 75 కోట్ల నష్టం వాటిల్లగా.. ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థ 46 కోట్లు లబ్ది పొందినట్టు ఏసీబీ గుర్తించింది. క్విడ్ ప్రోకో ద్వారా 44 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు బీఆర్ఎస్‌కు సమకూరినట్టు ఏసీబీ ప్రధానంగా ఆరోపిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్‌తో పాటు ఇతర నిందితులపై అభియోగాలు నమోదు చేసేందుకు అనుమతించాలని కోరుతూ ఏసీబీ ప్రభుత్వానికి లేఖ రాసింది. కాగా.. కేసులో A1 కేటీఆర్‌ కాగా.. A2 అర్వింద్‌కుమార్.. A3గా HMDA అప్పటి చీఫ్‌ ఇంజనీర్ BLN రెడ్డి ఉన్నారు. 

Full View


Tags:    

Similar News