Vemula Prashanth Reddy: స్థానిక సంస్థల ఎన్నికల కోసమే చీరల పంపిణీ
Vemula Prashanth Reddy: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే ఇందిరమ్మ చీరలను పంచుతున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు.
Vemula Prashanth Reddy: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే ఇందిరమ్మ చీరలను పంచుతున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. కేవలం ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో చీరలు పంచుతూ, మున్సిపాలిటీలలో పంచడం లేదన్నారు. బీసీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ నిలబెట్టు కోలేదన్నారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. కేవలం స్థానిక ఎన్నికల కోసమే చీరల పంపిణీ, వడ్డీలేని రుణాలు ఇస్తున్నారని.. ఇన్నాళ్లు ఎందుకు పంపిణీ చేయలేదని మండిపడ్డారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకోవటం ఖాయమని అన్నారు మాజీమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.