కాంగ్రెస్‌లో కీలక నేతగా విశిష్ట సేవలు అందించిన రోశయ్య

* నిద్రలోనే తుది శ్వాస విడిచిన 88 ఏళ్ల ఆర్ధికవేత్త * 1933 జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో రోశయ్య జననం

Update: 2021-12-04 04:29 GMT

కొణిజేటి రోశయ్య(ఫైల్ ఫోటో)

Konijeti Rosaiah: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పరమపదించారు. కాంగ్రెస్‌లో కీలక నేతగా సేవలందించిన రోశయ్య వయస్సు 88 ఏళ్లు. నిద్రలోనే గుండెపోటు రావడంతో హైదరాబాద్‌‌లోని తన నివాసంలో రోశయ్య తుది శ్వాస విడిచారు. వైయస్‌ మరణం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎం బాధ్యతలు చేపట్టారు రోశయ్య.

రోశయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నరుగా పనిచేశారు. మంచి వక్తగా రోశయ్యకు పేరుంది. 1933 జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించిన రోశయ్యకు ఆర్థిక సంబంధ విషయాలు, రాజకీయాలపై మంచి పట్టు ఉంది. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు.

తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో రోడ్డు రహదార్లు శాఖ, రవాణ శాఖల మంత్రిగా పనిచేసారు. ఆ తరువాత అనేక ముఖ్యమంత్రుల మంత్రి వర్గాలలో పలు కీలకమైన శాఖలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవమున్న కొణిజేటి రోశయ్య 2009, సెప్టెంబర్ 3 నుండి 2010 నవంబరు 24 వరకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2011 ఆగస్టు 31న రోశయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా ప్రమాణస్వీకారం చేశారు. 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించారు.

Tags:    

Similar News